ఖైదీ సూపర్ సక్సెస్ అనడానికి ఇదే నిదర్శనం

Published on Nov 8, 2019 8:27 am IST

ఈనెల 25న కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ చిత్రం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఓ మోస్తరు ఓపెనింగ్స్ తో మొదలైన ఖైదీ క్రమంగా వసూళ్ళలో పుంజుకుంది. పబ్లిక్ లో స్ట్రాంగ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ దక్కించుకున్న ఈ చిత్రం విడుదలై రెండు వారాలవుతున్నా అత్యధిక థియేటర్లలో ప్రదర్శించబడుతుందట. 250 థియేటర్లలో మొదలైన ఖైదీ తమిళ వర్షన్ ఇప్పుడు 350 థియేటర్లకు చేరిందట. ఈ విషయాన్ని ఖైదీ చిత్ర నిర్మాత ఎస్ ఆర్ ప్రభు తెలియజేశారు. దీనితో ఖైదీ చిత్రం క్లీన్ హిట్ సాధించిందని స్పష్టం అవుతుంది.

ఖైదీ త్వరలోనే 100కోట్ల వసూళ్ల మార్కును చేరే అవకాశం కలదు. ఇక త్వరలోనే ఖైదీ కి సీక్వెల్ గా ఖైదీ 2 చిత్రం రానుందని హీరోగా కార్తీ సక్సెస్ మీట్ లో తెలియజేశారు. సాంగ్స్, హీరోయిన్ వంటి ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా ఖైదీ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. ఈ మూవీ మొత్తం కేవలం నైట్ షేడ్ లో నడవడం మరో విశేషం.

సంబంధిత సమాచారం :

X
More