అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మహేష్ హీరోయిన్ !

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మహేష్ హీరోయిన్ !

Published on Apr 21, 2018 6:48 PM IST

నిన్న విడుదలైన ‘భరత్ అనే నేను’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ ముఖ్యంత్రిగా అలరించగా ఆయనకు జోడీగా బాలీవుడ్ నటి కైరా అద్వానీ నటించింది. మొదటి ప్రయత్నంలోనే మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని కొట్టేసిన కైరా అద్వానీ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తుందో, గోల్డెన్ ఛాన్సును ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలని అందరూ అనుకున్నారు.

కైరా కూడ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, డీసెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకునే అందం, డ్యాన్సులతో మహేష్ కు సరిజోడిగా నిలబడి, తెలుగులో మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకోని అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి సినిమాలో కూడ నటిస్తున్న ఈమె రాబోయే రోజుల్లో ఇంకొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ దక్కించుకుంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

తాజా వార్తలు