WAR 2: సోషల్ మీడియాని కమ్మేసిన కియారా

WAR 2: సోషల్ మీడియాని కమ్మేసిన కియారా

Published on May 21, 2025 8:00 AM IST

kiara advani 1

లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన పాన్ ఇండియా అవైటెడ్ టీజర్ ఏదన్నా ఉంది అంటే అది భారీ చిత్రం “వార్ 2” టీజర్ అనే చెప్పాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఇపుడు తెలుగు సహా హిందీ భాషల్లో భారీ రెస్పాన్స్ ని అందుకుంది.

అయితే ఈ టీజర్ లో అంతా హృతిక్, తారక్ లు హైలైట్ అవుతారు అంతా వారి కోసమే మాట్లాడుతారు అనుకుంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ లా హీరోయిన్ కియారా అద్వానీ వచ్చింది. ఆమెపై చూపించిన ఆ కొన్ని షాట్స్ ఇపుడు సోషల్ మీడియాని కమ్మేశాయి. ఆమె నుంచి మొదటిసారి బికినీ వేయడం పైగా ఆమెని ప్రెజెంట్ చేసిన విజువల్స్ కూడా ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇలా వార్ 2 టీజర్ నుంచి కియారా ఒక ఊహించని హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు