శంకర్, కైరా అద్వానీ.. పెద్ద డీల్

Published on Jun 25, 2021 12:12 am IST

బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ స్టార్ డైరెక్టర్ శంకర్ తో పెద్ద డీల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. శంకర్ డైరెక్ట్ చేయనున్న తదుపరి చిత్రాల్లో కైరా అద్వానీనే కథానాయకిగా చేయాలనేది ఈ డీల్ సారాంశమాట. శంకర్ తన తర్వాతి రెండు సినిమాలను ప్రకటించేశారు. వాటిలో ఒకటి రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం. అలాగే ఇంకొకటి ‘అపరిచితుడు’ హిందీ రీమేక్. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు. ఈ రెండు సినిమాల్లో కూడ కైరా అద్వానీనే కథానాయికగా చేయనుందట.

రామ్ చరణ్ సినిమా విషయమై త్వరలోనే కైరా అద్వానీ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను శంకర్ ‘ఇండియన్-2’ కంప్లీట్ చేశాక మొదలుపెట్టనున్నారు. భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు శంకర్ భవిష్యత్తులో డైరెక్ట్ చేయబోయే ఇంకొన్ని సినిమాల్లో కూడ కైరా అద్వానీనే కథానాయికగా చేయనుందనేది బాలీవుడ్ వర్గాల టాక్. అదే గనుక నిజమైతే కైరా అద్వానీ కెరీర్ మరింత వెలిగిపోవడం ఖాయం. కొన్నేళ్లపాటు ఆమెకు పెద్ద సినిమాల గురించి ఎదురుచూడాల్సిన అవసరం కూడ ఉండదు.

సంబంధిత సమాచారం :