సెకెండ్ షెడ్యూల్ కి కింగ్ రెడీ !

Published on May 17, 2021 10:32 am IST

కింగ్ నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ షూటింగ్ కూడా పూర్తీ చేసుకున్న ఈ సినిమా, తన తరువాత షెడ్యూల్ కోసం కూడా రెడీ అవుతుంది. వాస్తవానికి ఇప్పటికే సెకెండ్ షెడ్యూల్ కూడా పూర్తి కావాలి, కానీ, కరోనా కేసులు పెరుగుతుండటంతో చిత్రీకరణ వాయిదా చేసింది చిత్రబృందం. అయితే జూన్‌ మొదటి వారం నుంచి సెకెండ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నాం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. మరి ‘గరుడ వేగ’తో మంచి విజయం సాధించిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు నుండి ఈ సినిమా వస్తుండటంతో.. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. పైగా నాగార్జున తన లాస్ట్ సినిమా ‘వైల్డ్‌డాగ్‌’లో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :