సందడి చేసేందుకు “బంగార్రాజు” మళ్ళీ వచ్చేస్తున్నాడు!

Published on Aug 29, 2021 12:14 pm IST

ఈరోజు కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా సినీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండడమే కాకుండా తన సరికొత్త ప్రాజెక్ట్స్ నుంచి ఆసక్తికర అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ప్రవీణ్ సత్తారు తో ఫిల్మ్ “ది ఘోస్ట్” ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుండగా దానికి కంప్లీట్ డిఫరెంట్ గా నాగ్ చేస్తున్న మరో ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్ “బంగార్రాజు” నుంచి కూడా సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అప్డేట్ ని అక్కినేని యువ హీరో నాగ చైతన్య లాంచ్ చేసాడు. నాగ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్ హిట్ అయినటువంటి చిత్రం “సోగ్గాడే చిన్ని నాయన” లో తాను చేసిన “బంగార్రాజు” పాత్రని మరింత తీర్చిదిద్ది దానిపైనే కంప్లీట్ సినిమాని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చెయ్యగా దానికి మంచి హైప్ వచ్చింది.

నాగ చైతన్య కూడా నటిస్తున్న ఈ ఫీస్ట్ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ మళ్ళీ ఆ సినిమా వైబ్స్ ను తీసుకొచ్చింది అని చెప్పాలి. ఆకాశం నుంచి నేలకు దిగివస్తున్న బంగార్రాజు పోస్టర్ తో ఆసక్తికరంగా ఉంది. మరి నాగ్ బర్త్ డే కానుకగా వచ్చిన ఇది కూడా మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రంపై మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో రానున్నాయి.

సంబంధిత సమాచారం :