కింగ్ నాగ్ ‘రగడ’ మళ్లీ?

కింగ్ నాగ్ ‘రగడ’ మళ్లీ?

Published on May 18, 2025 8:00 AM IST

మన టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఇప్పుడు పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నాగార్జున సినిమాల్లో మాస్ చిత్రాలకి కొంచెం స్పెసిఫిక్ స్పేస్ ఉంటుంది అని చెప్పవచ్చు. అలా తన నుంచి వచ్చిన కొన్ని పక్కా మాస్ చిత్రాల్లో దర్శకుడు వీరూ పోట్ల తో చేసిన “రగడ” కూడా ఒకటి. అందులో నాగ్ డైలాగ్ డెలివరీ కానీ, కామెడీ సీన్స్ ఇంకా మాస్ మూమెంట్స్ ఫాన్స్ కి ఇప్పటికీ స్పెషల్ గానే ఉంటాయి.

మరి ఇలాంటి మాస్ చిత్రం మళ్లీ థియేటర్స్ లో అలరించేందుకు వస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి రీరిలీజ్ సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలుస్తోంది. ఇది అయ్యాక డేట్ వస్తుందట. డెఫినెట్ గా ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా అనుష్క, ప్రియమణి హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు