‘లెనిన్’ విషయంలో నాగ్ బోల్డ్ స్టేట్మెంట్.. ఓటిటి కోసం కాదు మోసం చెయ్యడం ఇష్టం లేక

‘లెనిన్’ విషయంలో నాగ్ బోల్డ్ స్టేట్మెంట్.. ఓటిటి కోసం కాదు మోసం చెయ్యడం ఇష్టం లేక

Published on Jul 8, 2026 2:59 PM IST

అక్కినేని వారి యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “లెనిన్”. కొంచెం ఆలస్యం అయినప్పటికీ డీసెంట్ బజ్ అయితే ఈ సినిమాపై నెలకొంది. ఈ నేపథ్యంలో మేకర్స్ లెనిన్ సినిమాని గట్టి ప్రమోషన్స్ చేస్తూ తీసుకెళ్తున్నారు. అయితే ఇదే ప్రయాణంలో అఖిల్ తండ్రి కింగ్ నాగార్జున కూడా తోడై అన్నీ తానై నడిపిస్తున్నారు.

అయితే ఈ సినిమా విషయంలో నాగ్ చేసిన ఓ స్టేట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంత ఆలస్యం అవుతూ వచ్చింది కాబట్టి ఓటిటి లెక్కలు మారడం లాంటివి జరగలేదని తెలిపారు. అయితే తాము ఈ సినిమా చేసింది ఓటిటి లెక్కలు కోసమో మరొక దాని కోసమో కాదని ప్రేక్షకులని మోసం చెయ్యడం ఇష్టం లేక ఆలస్యం అయ్యిందని తెలిపారు.

తాము ఎప్పుడు బెస్ట్ అవుట్ పుట్ కోసమే ప్రయత్నం చేశామని ముందు మాకు నచ్చితేనే కదా అప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తమకి నచ్చకుండా ఆడియెన్స్ ముందుకి సినిమా తీసుకొచ్చి మోసం చేయడం ఇష్టం లేకనే లెనిన్ ఆలస్యానికి కారణం అయ్యిందని తెలిపారు. జూన్ లోనే రావాల్సిన సినిమా మళ్ళీ టీం ఒక్క రెండు వారాలు గడువు అడిగి ఇంకా బెటర్ అవుట్ పుట్ అందిస్తామని చెప్తే అప్పుడు జూన్ నుంచి జూలై కి షిఫ్ట్ అయ్యిందని ప్రస్తుతం సినిమా అవుట్ పుట్ విషయంలో హ్యాపీ గానే ఉన్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు