ఊహించని అవతార్ లో కింగ్ నాగార్జున.!

Published on Aug 13, 2020 8:10 am IST

ఒంటికి ఆరు పదులు వయసు వచ్చినా సరే కొంత మంది స్టార్ హీరోలు ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తుంటారు. అలాంటి స్టార్ హీరోలలో ముందు వరుసలో ఉండేది మాత్రం అక్కినేని నాగార్జునే అని చెప్పాలి. ఇంత వయసొచ్చినా సరే తన ఫిట్నెస్ లెవెల్స్ ను మైంటైన్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు.

ఒక పక్క సినిమాలు చేస్తూనే తాను ఎంతో హిట్టయిన స్మాల్ స్క్రీన్ పై కూడా కొనసాగుతున్నారు. అయితే తన రాకతో తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు కొత్త టీఆర్పీ రికార్డుల లెక్కలను పరిచయం చేసిన కింగ్ నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ 4 తో కూడా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఇటీవలే ప్రోమో కట్ కు షూటింగ్ పూర్తి చేసుకున్న నాగార్జున తన లేటెస్ట్ ప్రోమోతో ఊహించని అవతార్ లో కనిపించి ఆశ్చర్య పరిచారు. వయసు మళ్ళిన ముసలాయనలా తెల్లని మీసాలు మరియు నెరిసిన జుట్టుతో కనిపించి ఒక స్కోప్ పట్టుకొని కంటెస్టెంట్స్ ను వీక్షిస్తున్నట్టుగా కనిపించారు. మరి ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొంత కాలం సస్పెన్స్ తప్పదు.

సంబంధిత సమాచారం :

More