ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్న నాగార్జున !

Published on Aug 8, 2018 12:44 pm IST

అడివి శేష్, శోభిత దూళిపాళ్ల హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘గూఢచారి’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా బాక్స్-ఆఫీసు వద్ద విజయవంతమైన చిత్రంగా దూసుకెళ్తుంది. మొత్తం మీద మొదటి వారాంతంలో ఘనమైన హిట్ గా నిలిచింది ఈ థ్రిల్లర్ మూవీ. దాంతో గూఢచారి చిత్రబృందం ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో విజయోత్సవ సభ నిర్వహించనుంది.

కాగా ఈ విజయోత్సవ సభకు హీరో నాగార్జున ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇటీవలే, నాగార్జున తన ట్విట్టర్ ద్వారా గూఢచారి టీంను మనస్ఫూర్తిగా అభినందించిన విషయం తెలిసిందే. అయితే తన బ్యానర్ లో విడుదల చేసిన ‘చి ల సౌ’ చిత్రం ఇంకా థియేటర్ లో ప్రదర్శించబడుతుండగానే ఇలా నాగార్జున మరో చిత్రాన్ని అభినందించి ప్రమోట్ చెయ్యటంతో నిజంగా నాగ్ ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More