మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ లో ఈ టాలెంటెడ్ నటుడు.. కోడ్ ఏంటి?

మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ లో ఈ టాలెంటెడ్ నటుడు.. కోడ్ ఏంటి?

Published on Aug 9, 2025 10:10 PM IST

SSmb29

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ సినిమా సహా వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి నేడు బిగ్ అప్డేట్ అందించారు. దీనితో సూపర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా కింగ్డమ్ లో తన నటనతో మెస్మరైజ్ చేసిన టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ గా సత్యదేవ్ చేసిన పోస్ట్ తో అభిమానుల్లో ఉత్సుకత నెలకొంది. బర్త్ డే విషెస్ తెలుపుతూ మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా లాస్ట్ లో ఓ మార్స్ కోడ్ తో హింట్ ఇచ్చారు. మరి ఈ హింట్ తో ‘ఆర్, బి’ అనే రెండు అక్షరాలు వస్తున్నాయి. మరి వీటి వెనుక అర్ధం ఏంటా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. మొత్తానికి ఈ క్రేజీ కలయికపై మరిన్ని అంచనాలు పెట్టుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు