“సమ్మతమే” ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతుందా.?

“సమ్మతమే” ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతుందా.?

Published on Jul 6, 2022 2:40 PM IST


లేటెస్ట్ గా మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం మరియు తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి లు నటించిన చిత్రం “సమ్మతమే” కూడా ఒకటి. మంచి అంచనాలు మరియు ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ చిత్రం కొన్ని రోజుల్లోనే ప్రాఫిట్స్ అందుకున్నట్టు మేకర్స్ తెలిపారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్న ఆహా వారు హింట్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి మాకు “సమ్మతమే” అంటూ రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ అతి త్వరలోనే అందజేస్తామని తెలిపారు. మరి ఈ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహించగా శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు