
‘స్వామిరార’ సినిమా దర్శకుడు సుదీర్ వర్మతో నాగ చైతన్య తీయబోయే సినిమా జూన్ ఆఖరి వరంలో మొదలకాబోతుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కీర్తి సనన్ నటించనుంది.
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వేలువడకపోయినప్పటికి, కీర్తి సనన్ దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో కీర్తి, తన నటనతో అందర్ని అక్కట్టుకుంది.
జాకీ ష్రాఫ్ తనయుడు హీరోగా పరిచయం అవుతున్న ‘హీరోపంతి’ సినిమాతో బాలీవుడ్ లో కూడా కీర్తి సనన్ అరంగేట్రం చేయబోతుంది.

