సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా చేస్తున్న చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం ఈ రోజు 10 గంటల 18 నిముషాలకు పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కలిసి మొదటి క్లాప్ నివ్వగా, జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక నవంబర్ 16వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఇప్పటికే విడుదలైన హీరో రామ్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రామ్ సరసన నివేత పేతురేజ్ మరియు మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించనున్నారు. కాగా రామ్ తన కెరీర్లో మొదటిసారి ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారు.
కాగా ఇప్పటి వరకూ రామ్ చేసిన సినిమాలకు ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్ – తిరుమల కిషోర్ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : పీటర్ హెయిన్స్ ,ఎడిటింగ్: జునైద్.


