వరుణ్ కోసం చరణ్ హీరోయిన్…?

Published on Nov 3, 2019 3:00 am IST

గద్దలకొండ గణేష్ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు హీరో వరుణ్ తేజ్. ఊరమాసు గ్యాంగ్ స్టర్ గా వరుణ్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. కాగా వరుణ్ తన తదుపరి చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. వరుణ్ 10వ చిత్రంగా రానున్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా గీత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనుండడం విశేషం. దీని కోసం వరుణ్ ఆల్రెడీ కసరత్తులు కూడా మొదలుపెట్టారట. ఐతే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

ఈ మూవీలో వరుణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారట. ఆమెతో ఈ విషయమై చర్చలు కూడా జరిపారని సమాచారం. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కియారా బాలీవుడ్ లో బిజీ ఐపోయారు.టాలీవుడ్ లో మరలా నటించడానికి ఆమె ఆసక్తి చూపుతుందో లేదో చూడాలి. కియారా తెలుగులో చరణ్ సరసన వినయ విధేయ రామ, మహేష్ మూవీ భరత్ అనే నేను చిత్రాలలో నటించింది.

సంబంధిత సమాచారం :