చిరు మూవీ కోసం థాయిలాండ్ వెళ్లిన కొరటాల.

Published on Dec 9, 2019 11:11 am IST

తక్కువ కాలంలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు దర్శకుడు కొరటాల శివ. ఆయన చేసింది ఇప్పటికి నాలుగు సినిమాలే అయినప్పటికీ ఆ చిత్రాలన్నీ సూపర్ హిట్స్ కావడం విశేషం. కాగా కొరటాల శివ తన ఐదవ చిత్రం మెగాస్టార్ చిరంజీవితో కమిటయ్యారు. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితం అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఐతే ఈ ప్రాజెక్ట్ కొరకు మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మను తీసుకోవడం జరిగింది. ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్స్ కొరకు దర్శకుడు కొరటాల మరియు మణిశర్మ థాయిలాండ్ వెళ్లారు. అక్కడ చిత్రానికి సంబందించిన బాణీలపై కసరత్తు మొదలుపెట్టారు. ఓ సోషల్ కాన్సెప్ట్ ఆధారంగా కమర్సియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పాటలకు చాలా ప్రాధాన్యం ఉండటంతో సీనియర్ అయిన మణిశర్మను తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫార్మ్ లోకొచ్చిన మణిశర్మ దాదాపు రెండు దశాబ్దాలు టాప్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ వచ్చారు.

సంబంధిత సమాచారం :

More