కోలీవుడ్ లో రికార్డు ఓపెనింగ్ ను రాబట్టిన కాంచన 3 !

Published on Apr 20, 2019 7:08 pm IST

ముని సిరీస్ లో భాగంగా రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంచన 3. మంచి అంచనా ల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ రేటింగ్స్ వచ్చిన భారీ ఓపెనింగ్ ను రాబట్టింది. తమిళ నాడు లో ఈ చిత్రం మొదటి రోజు 10. 72 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లారెన్స్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది. దాంతో ఈ చిత్రం అక్కడ ఈ ఏడాది విశ్వాసం ,పేట తరువాత హైయెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టింది.

ఇక ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి వసూళ్లను రాబడుతుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వేదిక , ఓవియా ముఖ్య పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :