హిందీలో రీమేక్ కానున్న కోలీవుడ్ మూవీ !

Published on Apr 25, 2019 9:00 pm IST

విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణన్, ఫహద్ ఫాజిల్, మిస్కిన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సూపర్డీలక్స్ ఇటీవల విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. త్యాగరాజన్ కుమార రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో సమంత, విజయ్ సేతుపతి నటన సినిమా కు హెలైట్ అయ్యాయి. ఇక ఈ చిత్రం తెలుగు లోనూ విడుదలకానుందని వార్తలు వచ్చాయి అయితే ఈచిత్రం కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ సాహసం చేయలేదు.

అయితే ఈ చిత్రాన్నిత్యాగరాజన్ కుమార రాజా ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :