విషాదం..కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత.!

Published on Apr 30, 2021 7:51 am IST

మన టాలీవుడ్ లో పలువురు తమిళ హీరోలు అత్యంత చెరువు కావడానికి ఒకప్పుడు వారు చేసిన సినిమాలు అనే చెప్పులు. మరి అలాంటి హీరోలలో విలక్షణ నటుడు సూర్య కూడా ఒకరు. మరి అలాంటి సూర్యతో “వీడోక్కడే”, “బ్రదర్స్” లేటెస్ట్ గా “బందోబస్త్” లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు సహా జీవాతో “రంగం” ఇంకా పలు ఆసక్తికర సినిమాలుతో టాలీవుడ్ లో కూడా ఓ స్థాయిలో అలరించిన దర్శకుడు కేవీ ఆనంద్ ఇప్పుడు లేరు అన్నది ఒక్క కోలీవుడ్ ఉండస్ట్రీకే కాకుండా ఇండియన్ సినిమాకే తీరని విషాదం.

కేవలం దర్శకునిగానే కాకుండా పదుల సంఖ్యలో అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేశారు. అయితే ఆయన ఈరోజు తెల్లవారునే చెన్నైలో తన 53వ ఏట ఆకస్మిక గుండెపోటు రావడం మూలాన తుది శ్వాస విడిచినట్టుగా తెలిసింది. అయితే గత కొన్నాళ్ల కితమే సూర్యతో ఐకానిక్ చిత్రం “వీడోక్కడే” కు సీక్వెల్ ను కూడా ప్లాన్ చేసారని టాక్ వచ్చింది. మరి ఇలాంటి టాలెంటెడ్ దర్శకుడు ఇప్పుడు లేరు అనే వార్త నిజంగా విషాదకరం. మరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతిని 123తెలుగు టీం తరపున వ్యక్త పరుస్తున్నాం.

సంబంధిత సమాచారం :