టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ యంగ్ హీరో !

Published on Mar 27, 2019 12:48 am IST

డీజే తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవలే తన కొత్త చిత్రం వాల్మీకి ని మొదలు పెట్టాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తండా’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. కాగా మరో ముఖ్యమైన పాత్ర కోసం తమిళ యువ హీరో అథర్వ మురళి ని తీసుకుంటున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ యువ హీరో ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. ఈ రీమేక్ లో ఒరిజినల్ వెర్షన్ లో సిద్దార్థ చేసిన పాత్రలో అథర్వ నటించనున్నాడు.

ఇక ఈ చిత్రానికి కథానాయిక ను కూడా ఎంపిక చేయాల్సి వుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ఆచంట , గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More