‘బలుపు’ను పక్కన పెట్టి ‘పవర్’ చేశాం – కోన వెంకట్

‘బలుపు’ను పక్కన పెట్టి ‘పవర్’ చేశాం – కోన వెంకట్

Published on Sep 4, 2014 7:06 PM IST

venkat-kona
రవితేజ, హన్సిక, రెజినా నటినటులుగా రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన చిత్రం ‘పవర్’. ఈ చిత్రంతో ‘బలుపు’ కధా రచయిత కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమన్ సంగీతం అందించారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలియజేయడానికి దర్శకుడు బాబీ, రచయిత కోన వెంకట్ పాత్రికేయులతో సమావేశం అయ్యారు.

కోన వెంకట్ మాట్లాడుతూ…. రవితేజ, బాబీ, నా కాంబినేషన్లో వచ్చిన ‘బలుపు’ ఘనవిజయం సాదించింది. ఆ సినిమా రైటర్ బాబీ ‘పవర్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ మూవీకి చాలా హెవీ సబ్జెక్ట్(క్లిష్టమైన, బరువైన కథ) రెడీ చేసుకున్నాడు. బ్లాక్ & వైట్ కాలం నుండి నేటి వరకు పోలీస్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాటికి పూర్తి వైవిధ్యమైన కథతో ‘పవర్’ ఉంటుంది. ఇప్పటివరకు పోలీస్ క్యారెక్టర్లో ఎవరు టచ్ చేయని పాయింట్’ను బాబీ ఈ సినిమాలో చూపిస్తున్నాడు. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సెంటిమెంట్ సన్నివేశాలలో రవితేజ అద్బుతంగా నటించాడు. ఈ మెగా మాస్ ఎంటర్టైనర్ తప్పకుండా విజయం సాదిస్తుంది. ‘బలుపు’ విజయం తర్వాత చేస్తున్న ఈ సినిమా కోసం మా బలుపును పక్కన పెట్టి జాగ్రత్తగా చేశాం.

‘పవర్’ సినిమా మొదట సెప్టెంబర్ 5న విడుదల చేయాలనుకున్నాం. సెన్సార్ బోర్డు నిబంధనల కారణంగా ఒక వారం ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. పరోక్షంగా ఆమె(ధనలక్ష్మి) మాకు హెల్ప్ చేసింది. సినిమాను ప్రమోట్ చేయడానికి మంచి సమయం దొరికింది. అని అన్నారు.

దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ…. సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశారా..? అని అందరూ అడుగుతున్నారు. సెప్టెంబర్ 12న సినిమా చూసి ఆ విషయం తెలుసుకోండి. రవితేజ నటన సినిమాకి మెయిన్ హైలైట్. నిర్మాత ఫ్రీడం ఇచ్చారు. ఫస్ట్ మూవీకి గొప్ప గొప్ప టెక్నీషియన్లతో కలసి పనిచేయడం నా అదృష్టం. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు