మెగాస్టార్ సినిమాలో శ్రుతి హాసన్ ఉంటుందా ?

మెగాస్టార్ సినిమాలో శ్రుతి హాసన్ ఉంటుందా ?

Published on Mar 13, 2019 3:05 PM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తన తరువాత సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న విషయం తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కొరటాల శివ తన శ్రీమంతుడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రుతి హాసన్ ను, మెగాస్టార్ తో చేయబోయే సినిమా కోసం హీరోయిన్ గా తీసుకోనున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా కాకుండా ఓ కీలకమైన పాత్రలో నటిస్తోన్నట్లు సమాచారం. శ్రుతిహాసన్‌ సౌత్ సినిమాలలో నటించి ఇప్పటికే దాదాపు రెండేళ్లు అవుతుంది. కమలహాసన్‌ తో కలిసి శభాష్‌నాయుడులో నటించినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోయింది.

కాగా ప్రస్తుతం ఆమె హిందీ చిత్రాల్లో నటిస్తూనే.. కొన్ని రియాలిటీ షోలు చేస్తోంది. ఇక మెగాస్టార్ – కొరటాల సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు