కొరటాల బర్త్ డే ట్రీట్ పై ఆసక్తి..!

Published on Jun 14, 2021 7:06 am IST

టాలీవుడ్ సినిమాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడు అనే టాగ్ లైన్ ను బెంచ్ మార్క్ లా సెట్ చేసేసుకున్న కొరటాల శివ కూడా ఒకరు. తనదైన సబ్జెక్టు లతో ఒకదాన్ని మించి ఒక హిట్ కొడుతూ దూసుకెళ్తున్నారు.. మరి ఇదే బ్లాక్ బస్టర్ దర్శకుడు పుట్టినరోజు ఇంకొరోజులో వస్తుండగా ఆ స్పెషల్ డే కి ట్రీట్ గా ఎమోస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల మరియు మెగాస్టార్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య” నుంచి సెకండ్ సింగిల్ కొంతమంది ఆసిస్తుండగా మరికొందరు తారక్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ పై ఏమన్నా అప్డేట్ వస్తుందేమో అని ఆశిస్తున్నారు.. కానీ వీటిలో దీనిపై కూడా ఇంకా మినిమం గ్యారెంటీ లేదు.. సో అభిమానులు కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుంటేనే మంచింది. మరి వేచి చూడాలి ఏదైనా అప్డేట్ వస్తుందో లేదో అన్నది..

సంబంధిత సమాచారం :