మొత్తానికి ఏమీ లేకుండానే ముగించిన కొరటాల.!

Published on May 21, 2021 10:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిన్న సోషల్ మీడియాలో తన అభిమానులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఆ వేడుకలను మరో స్థాయికి తీసుకెళ్తు తారక్ నటిస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి ఒక మాస్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసి మంచి హై ఇచ్చారు.

ఇక దీని తర్వాత అనుకున్న విధంగానే మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమాపై కూడా అధికారిక అప్డేట్ రావడంతో ఆ సంబరాలు మిన్నంటాయి. కానీ వెలితి ఏదన్నా మిగిలింది అంటే దర్శకుడు కొరటాల నుంచే అని చెప్పాలి. ఈ కాంబోలో వస్తున్న రెండో చిత్రంపై కూడా ఒక సాలిడ్ అప్డేట్ వస్తుందని అంతా ఆశించారు.

కానీ అలాంటిది ఏమీ జరగకపోవడంతో ఒకింత నిరాశే మిగిలింది. ఇలా మొత్తానికి కొరటాల ఏమీ లేకుండానే ముగించేశారని చెప్పాలి. మరి నెక్స్ట్ సాలిడ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం :