‘ఆచార్య’ షూట్ పై బిగ్ అప్ డేట్ !

Published on Jun 27, 2021 3:02 am IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితులు మెరుగుపడుతున్న నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. అయితే ‘ఆచార్య’ బ్యాలెన్స్ షూట్ వర్క్ ఇక కేవలం 12 రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. వీలైనంత త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి తొందరగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. కొరటాల రాసిన కథలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుందట. ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే.

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :