మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు

27th, August 2016 - 03:11:47 PM

Mahesh-Babu-Koratala-Shiva
కొరటాల శివ.. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ కే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచి కమర్షియల్ సినిమాలకి కొత్త అర్థాన్నిచ్చిన దర్శకుడు. మహేష్ బాబు.. టాలీవుడ్ ప్రిన్స్ గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో. వీళ్లిద్దరూ గతంలో కలిసి చేసిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. అలాంటి వీరి సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.

ఎన్టీఆర్ హీరోగా తాను తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం రిలీజ్ సందర్బంగా జరిగిన ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు. మహేష్ నెక్స్ట్ సినిమా తనతోనేనని, ఆ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారని, ఈ ప్రాజెక్ట్ 2017 జనవరిలో మొదలుకానుందని తెలిపాడు. దీంతో మరోసారి మహేష్ ఇండస్ట్రీ రహిట్ కొట్టడం ఖాయమని అభిమానాలు భావిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.