సత్యదేవ్ కోసం ప్రెజెంటర్ గా మారిన కొరటాల శివ!

Published on Jul 4, 2021 9:07 pm IST

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సత్యదేవ్ ఒకరు. అయితే సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు పలు సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటుగా, కొన్ని సినిమాలను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అందులో ఆసక్తికరం గా మారింది ఈ ప్రొడక్షన్ నంబర్ 2. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ సత్యదేవ్ కోసం ప్రెజెంటర్ గా మారిపోయారు. సత్యదేవ్ 25 వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు అయిన కృష్ణ కొమ్మాలపాటి అరుణాచల క్రియేషన్స్ పతాకం పై ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతకు ముందు సాయి ధరమ్ తేజ్ తో జవాన్ అనే చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్రానికి కొత్త దర్శకుడిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని నేడు ప్రకటించడం జరిగింది. అయితే ఈ చిత్రం తో పాటుగా నేడు గాడ్సే మరియు గుర్తుందా శీతాకాలం లో కూడా నటిస్తున్నారు. అయితే గాడ్సే చిత్రం షూటింగ్ ఈ నెల మళ్ళీ మొదలు కానుంది. అయితే అంతకుముందు బ్లఫ్ మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసిన గోపి గణేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :