సంచలన ప్రకటన చేసిన కొరటాల శివ

Published on Jun 26, 2021 3:02 am IST

స్టార్ దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సోషల్‌ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు. ‘నేను సోషల్ మీడియా నుండి పూర్తిగా తప్పుకుంటున్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నాను. ఇప్పటివరకు మీతో అనేక విషయాలు పంచుకున్నాను. మీరో నాకు చాలా మూమెంట్స్ ఉన్నాయి. కానీ విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మన మీడియా స్నేహితుల ద్వారా మీతో ఎప్పుడూ టచ్లోనే ఉంటాను. మనం ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం. మన మధ్య మీడియం మరిందే తప్ప బంధం కాదు’ అంటూ ప్రకటన విడుదల చేశారు.

ఇలా ఉన్నట్టుండి ఆయన సామాజిక మధ్యమాలను విడిచిపెట్టడంతో అభిమానులు షాకవుతున్నారు. కొరటాల ఇలాంటి షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడ నాటిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం పూర్తికాగానే ఆయన ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమా పనులు మొదలుపెడతారు. గతంలో కూడ కొరటాల తాను కొన్నేళ్ల తర్వాత దర్శకుడిగా కూడ రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :