కొరటాల సినిమాలో మెగాస్టార్ సరసన ఆ స్టార్ హీరోయిన్ ?

Published on Aug 8, 2018 8:35 am IST

రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్నాడట కొరటాల.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం, కొరటాల శివ తన తొలి చిత్రం ‘మిర్చి’లో హీరోయిన్ గా నటించిన అనుష్క శెట్టిని తాను మెగాస్టార్ తో చేయబోయే సినిమా కోసం హీరోయిన్ గా తీసుకోనున్నారు. ఇప్పటికే అనుష్క కూడా నటించడానికి అంగీకరించదని తెలుస్తోంది. అయితే, ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ప్రారంభం కాబోతోంద‌ని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More