మంచి సినిమాను ఇస్తానంటున్న కొరటాల శివ !
Published on Mar 7, 2018 9:34 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ సినిమా యొక్క టీజర్ నిన్న సాయంత్రం రిలీజై ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఈ స్పందనతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో దర్శకుడు కొరటాల శివ ఇంకొంత ఉత్సాహాన్ని పుంజుకున్నారు.

టీజర్ పట్ల ప్రేక్షకులు చూపిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కు కృతజ్ఞతలని, తను, తన టీమ్ ఇంకాస్త ఎక్కువగా కష్టపడి మంచి సినిమాను అందిస్తామని అన్నారు. ఏప్రిల్ 20న విడుదలకానున్న ఈ సినిమాను డివివి. దానయ్య నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇప్పటికే సత్తా చాటిన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి కైరా అద్వానీ తెలుగు తెరకు పరిచయంకానుంది.

 
Like us on Facebook