కంటెంట్ వల్లే కొరటాల ఒప్పుకున్నాడట !

Published on Jul 5, 2021 11:00 am IST

సత్యదేవ్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. వైవిధ్యభరిత సినిమాలలో కథానాయకుడిగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా తాజాగా తన 25వ సినిమాని కూడా సెట్ చేసుకున్నాడు ఈ హీరో. పైగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. నూతన దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ ఈ సినిమా దర్శకత్వం వహించనున్నాడు.

కాగా నిన్న సత్యదేవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సినిమా పక్కా ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అట. సినిమాలో కంటెంట్ చాల బలంగా ఉంటుందని.. కంటెంట్ తనకు బాగా నచ్చడం వల్లే కొరటాల ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతం కాల భైరవ అందిస్తున్నాడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత బాధ్యతలు నిర్వహించనున్నారు.

సంబంధిత సమాచారం :