కొరటాల – ప్రభాస్ కలయికలో సినిమా.. ఎప్పుడంటే?

Published on Jul 4, 2022 8:01 am IST

క్లాస్ డైరెక్టర్ కొర‌టాల శివ‌ ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. ఈ సినిమా తర్వాత కొరటాల ఎవరితో సినిమా చేయబోతున్నాడు ?, ఆ మధ్య అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా మరో స్టార్ హీరోతో కొరటాల సినమా ఉంటుందని తెలుస్తోంది. తనకు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చి.. తనను డైరెక్టర్ ను చేసిన ప్రభాస్ తో కొరటాల తన తర్వాత సినిమా ప్లాన్ చేశాడట.

కాగా కొరటాల – ప్రభాస్ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి. ఇక కొరటాల ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం, కొరటాల ప్రభాస్ తోనే సినిమా చేస్తాడట.

ఆ తర్వాత బాలయ్య బాబుతో కూడా ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరి హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల, చరణ్ కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి.

సంబంధిత సమాచారం :