మెగాస్టార్ – కొరటాల సినిమాలో శ్రుతి హాసన్ ?

Published on Mar 7, 2019 5:27 pm IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తన తరువాత సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న విషయం తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ కూడా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం, కొరటాల శివ తన శ్రీమంతుడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రుతి హాసన్ ను, మెగాస్టార్ తో చేయబోయే సినిమా కోసం హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది.

అయితే శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా కాకుండా ఓ కీలకమైన పాత్రలో నటిస్తోన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More