బడా ప్రొడ్యూసర్స్ నుండి కొరటాలకు భారీ ఆఫర్

Published on Jul 1, 2020 2:15 pm IST

టాలీవుడ్ లో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ టాప్ గేర్ లో దూసుకుపోతుంది. స్టార్ హీరోలతో భారీ హిట్స్ అందుకున్న ఈ సంస్థ క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తుంది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ చేతిలో బన్నీ పుష్పతో పాటు, మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రాలు ఉన్నాయి. కాగా మైత్రి మూవీ మేకర్స్, డైరెక్టర్ కొరటాల శివతో మరో చిత్రానికి సైన్ చేశారని సమాచారం అందుతుంది. కొరటాల… చిరుతో చేస్తున్న ఆచార్య మూవీ తరువాత మైత్రి మూవీ మేకర్స్ కి ఓ చిత్రం చేస్తారని సమాచారం.

ఈ చిత్రం కోసం ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన నిర్మాతలు భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చారట. మొత్తంగా కొరటాలను ముందుగానే లాక్ చేసి పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆచార్య మూవీ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఆస్కారం లేదు. కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో సెట్స్ కి రావడానికి చిరంజీవి ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ తో కొరటాల మూవీ 2021 మధ్యలో మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో హీరో ఎవరు అనేది తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

More