మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, నేడు వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘కొరియన్ కనకరాజు’ పేరుతో ఈ సినిమా రూపొందుతున్నట్లు అధికారికంగా మేకర్స్ తెలియజేశారు.
అన్నట్టు ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ ‘నేను తిరిగొచ్చేశా’ అంటూ కొరియన్ భాషలో చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ, ఈ సినిమాకి కొరియన్ భాషకు ఏమిటి సంబంధం అనేది ? సినిమాలో చాలా ఆసక్తిగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
