విడుదలకు సిద్దమవుతున్న కొత్తజంట

విడుదలకు సిద్దమవుతున్న కొత్తజంట

Published on Apr 26, 2014 1:02 PM IST

Kotha_Janta (7)
అల్లు శిరీష్, మారుతి ల కలయికలో రానున్న కొత్తజంట సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని సంపాదించుకుంది. మే 1 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. ట్రైలర్ లోనే ప్రేక్షకులను మెప్పించిన రెజినా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది

ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు లేకుండా సినిమా తీసానని మారుతి చెప్పుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వ్యాస్ ఈ సినిమాకు నిర్మాత. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. జె.బి సంగీతదర్శకుడు

తాజా వార్తలు