ఇండియన్ టీమ్ కి ‘కౌసల్య కృష్ణమూర్తి’ విషెస్ .

Published on Jun 30, 2019 5:11 pm IST

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రీడా ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం “కౌసల్య కృష్ణమూర్తి”. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కన్నా’ మూవీకి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. పల్లెటూరిలో పుట్టిన ఒక సాధారణ అమ్మాయి అన్ని అవరోధాలను అధిగమించి ప్రపంచ స్థాయి క్రికెటర్ గా ఎలా ఎదిగింది అనేది ప్రధాన కథాంశం. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన వస్తుంది.

ఐతే ప్రస్తుతం ఇంగ్లాడ్ వేదికగా ప్రపంచ క్రికెట్ వరల్డ్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు టోర్నమెంట్ లోని ప్రధాన జట్లలో ఒకటైన ఇంగ్లాండ్ తో ఇండియా టీం తలపడనున్న నేపథ్యంలో కౌసల్య కృష్ణమూర్తి చిత్ర యూనిట్ భారత జట్టుకి బెస్ట్ విషెస్ చెబుతూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. క్రికెట్ నేపధ్యంలో సాగే చిత్రం కావడంతో ప్రమోషన్ కోసం ఇలా విషెస్ చెప్పడం సినిమాకు కలిసొచ్చే అంశమే. రాజేంద్రప్రసాద్,వెన్నెల కిషోర్,కార్తీక్ రాజు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ధిబు నైనన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More