క్రాక్ లో ఆ ఎపిసోడ్స్ ఎక్కువగానే ఉన్నట్టున్నాయిగా..!

Published on Apr 2, 2020 11:07 am IST

రవితేజ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్. దర్శకుడు గోపి చంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికాగా వేసవి కానుకగా మే 8న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఐతే కరోనా కర్ఫ్యూ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ నిలిపి వేయడంతో ఈ మూవీ వేసవికి రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె రవి తేజ భార్య రోల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో ఫ్యామిలీ ఎపిసోడ్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తున్నాయి. భార్య, కొడుకు తో అందమైన ఫ్యామిలీ కలిగిన పోలీస్ గా రవితేజ కనిపించనున్నాడు.

ఇప్పటికే విడుదలైన క్రాక్ టీజర్ మరియు పోస్టర్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. బి మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మధ్య విజయాల పరంగా వెనుకబడ్డ రవితేజ క్రాక్ మూవీ పై చాల ఆశలే పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More