చిట్ చాట్ : క్రాంతి మాధవ్ – ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సక్సెస్ కొత్త కథలు రాయడానికి స్పూర్తినిచ్చింది.

చిట్ చాట్ : క్రాంతి మాధవ్ – ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సక్సెస్ కొత్త కథలు రాయడానికి స్పూర్తినిచ్చింది.

Published on Feb 8, 2015 5:49 PM IST

Kranthi-Madhav

‘ఓనమాలు’ సినిమాతో ప్రత్యేక సెక్షన్ కి చెందిన అభిమానులను, వ్మర్శకులను మెప్పించిన డైరెక్టర్ క్రాంతి మాధవ్. క్రంత్తి మాధవ్ తన ద్వితీయ యజ్ఞంగా తెరకెక్కించిన సినిమా లవ్ స్టొరీ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవ్వడమే కాకుండా ఇటు ప్రేక్షకుల నుంచి, అటు విమర్శకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. హో క్రాంతి మాధవ్ తో కాసేపు చిట్ చాట్ చేసాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.?
స) అవునండి పాజిటివ్ టాక్ వచ్చింది చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ సినిమాలోని ఎమోషన్స్ ని బాగా ఫీలవుతున్నారు, అలాగే పాత్రలని ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా విజయంతో మరిన్ని మంచి కథలు రాయాలనే స్ఫూర్తి వచ్చింది. అందుకే ఈ సినిమా విజయం ప్రేక్షకులకే చెందుతుంది.

ప్రశ్న) ఇందులో మీరు శర్వానంద్, నిత్యా మీనన్ లను ఫాథర్ అండ్ మదర్ గా చూపించారు.. అది చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు.?
స) నేను కథ రాసుకున్న రాసుకోవడం పూర్తయ్యాక ముందుగా నా మదిలో వచ్చిన వారు నిత్యా మీనన్, శర్వానంద్. ఇద్దరూ కథ చెప్పగానే బాగా నచ్చి ఓకే చెప్పారు. మీరు చెప్పినట్టు యంగ్ నటీనటులైన వీరిద్దరినీ ఫాదర్, మదర్ గా చూపించగానే అందరూ షాక్ అవుతారని తెలుసు. కానీ వాళ్ళిద్దరూ కథను నమ్మి అలా చేసారు. కావున ఆ క్రెడిట్ మొత్తం శర్వానంద్, నిత్యా మీనన్ కే ఇవ్వాలి.

ప్రశ్న) మీరు అనుకున్న కథలో సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు, నిత్యా మీనన్, శర్వానంద్ ల ఇన్వాల్వ్ మెంట్ ఎంతవరకూ ఉంది.? వాళ్ళు ఏమన్నా మార్పులు చేసారా.?
స) ఈ సినిమా కథ విషయంలో ఎవ్వరూ ఎలాంటి మార్పు చెప్పలేదు. మొదటగా నేను ఏమి కథ చెప్పానో అదే పాయింట్ ని తీశాను. మొదటి నుంచి వాళ్ళు నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు కథలో ఇన్వాల్వ్ అవ్వలేదు.

ప్రశ్న) సాయి మాధవ్, జ్ఞానశేఖర్, గోపి సుందర్ ల వర్క్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళ గురించి చెప్పండి.?
స) కథ నుకున్నాక సాయి మాధవ్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ అని తీసుకున్నాం. మొదటి నుంచి నాతో పాటు ట్రావెల్ అయ్యి ప్రతి సీన్ కి సూపర్బ్ డైలాగ్స్ రాసాడు. అలాగే జ్ఞానశేఖర్ కూడానేను స్టొరీ లైన్ చెప్పినప్పటి నుంచీ నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నారు. ప్రతి లొకేషన్ ని మేమిద్దరం వెళ్లి విజిట్ చేసాం. కావున ప్రతి సీన్ తీసేప్పుడు ఎలా తీయాలనేది మా ఇద్దరికీ బాగా క్లారిటీ ఉండేది. మలయాళంలో కొన్ని సినిమాలకు గోపి సుందర్ అందించిన మ్యూజిక్ విని అతన్నే తీసుకోవలనుకున్నాను. నా కథకి వీళ్ళు ముగ్గురు లేకపోతే ఈ సినిమా ఇంట బాగా వచ్చేది కాదు.

ప్రశ్న) కెఎస్ రామారావు గారి సపోర్ట్ ఎంత వరకూ ఉంది.?
స) అందరికంటే ముందు ఆయనకే నా స్పెషల్ థాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఈ కథ చెప్పగానే నన్ను నమ్మి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా నేను అడిగిన అన్ని నాకు సమకూరచ్చారు. ఆయన లేకపోతే ఈ అందమైన ప్రేమకథ మీ ముందుకు వచ్చేది కాదు. ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది.

ప్రశ్న) చివరిగా మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) ప్రస్తుతానికి నా తదుపరి సినిమా గురించి ఆలోచించలేదండీ.. ఇప్పుడు నా దృష్టంతా ఈ సినిమాని ఇంకా జనంలోకి తీసుకెళ్ళడానికి ఏమి చెయ్యాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాను.

తాజా వార్తలు