క్రిష్ ‘మణికర్ణిక’ ఆ రోజే రానుంది !

క్రిష్ ‘మణికర్ణిక’ ఆ రోజే రానుంది !

Published on Jul 21, 2018 10:00 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి హిందీ భాషలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మణికర్ణికా’. పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సమ్మర్లోనే రావల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఆ తరువాత ఈ సినిమాని ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవము రోజున విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించారు .

కాని అప్పటికి కూడా ఈ చిత్ర నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం లేనందున వచ్చే ఏడాది జనవరి 25 న విడుదలచేయనున్నారు. విఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ఈచిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు నిర్మాతలు. సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు