ఆశ్చర్యాన్ని కలిగిస్తోన్న క్రిష్ కామెంట్స్ !

Published on Apr 5, 2021 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘వకీల్ సాబ్’ మీద ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకుని ఉన్నారు. పవన్ రీఎంట్రీని పండుగలా సెలబ్రేట్ చేయాలనుకుని నిన్న రాత్రి ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ సినిమా ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారయిన పవన్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం దర్శకుడు క్రిష్ పవన్ ఫ్యాన్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఇంతకీ క్రిష్ చేసిన కామెంట్స్ ఏమిటంటే.. ‘ఫ్యాన్స్‌లందు పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా అన్నది నిజం. మొన్న షూటింగ్ జరుగుతోంది.. లంచ్ టైంలో నోటిఫికేషన్స్ చూద్దామని ట్విట్టర్ ఓపెన్ చేసి చూశాను. అందులో వచ్చిన మెసేజ్‌లు చూసి నాకు ఆశ్చరం కలిగింది. ఎండలు బాగా ఉన్నాయి మా హీరోని జాగ్రత్తా చూసుకోండి అంటూ ఫ్యాన్స్ నాకు మెసేజ్ చేశారు అంటూ పవన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పై ఎంత అభిమానాన్ని చూపిస్తారో ఆ మెసేజ్ లు చూస్తే అర్ధం అవుతుంది. ఏమైనా క్రిష్ కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోన్నాయి.

సంబంధిత సమాచారం :