
దసరా కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కంచె’ సినిమా థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను ఓ సరికొత్త అనుభూతితో బయటకి వచ్చేలా చేస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ వరల్డ్ వార్ II లో షూట్ చేసిన ఎపిసోడ్స్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక సినిమాతో ఒకదానికి సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమానే ‘కంచె’. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ వలన కలెక్షన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.
ఇకపోతే ఈ సినిమా తీయడం కోసం క్రిష్ మదన పడిన విషయం గురించి మీడియాకి తెలిపాడు. ‘మొదట నేను కంచె స్టొరీని చాలా మంది ప్రముఖులకు చెప్పినప్పుడు ఈ కథ వర్క్ అవుట్ అవ్వదు. దీన్ని సినిమాగా తీస్తే ఎవ్వరూ చూడరు అని అన్నారు. అందుకే నేను సైలెంట్ గా ఈ సినిమాని తీసి రిలీజ్ చేసాను. ఇప్పుడు వాళ్ళే వచ్చి నన్ను మెచ్చుకుంటున్నారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని’ క్రిష్ అన్నాడు. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. అందరినీ అబ్బురపరిచే వరల్డ్ వార్ II సీన్స్, వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన కదిలించే డైలాగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు 1940 కంటెంట్ ని సూపర్బ్ గా ప్రెజంట్ చేసిన విధానం అందరికీ బాగా నచ్చుతుంది.

