భావోద్వేగ సన్నివేశాల్లో నటించబోతున్న క్రిష్ !

Published on Jul 27, 2018 4:16 pm IST

క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ శరవేగంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోన్న విషయం తెలిసిందే.. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో ఓ గొప్ప దర్శకుడి పాత్రను పోషించబోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే లెంజెండరీ దర్శకుడైన కేవీ రెడ్డిగారి పాత్రలో ఆయన నటించనున్నారు. అయితే క్రిష్ ఇంతకుముందు ‘మహానటి’ చిత్రం లో కేవీ రెడ్డి పాత్రలో కనిపించనప్పటికీ ఎన్టీఆర్ చిత్రంలో మాత్రం చాలా భావోద్వేగ సన్నివేశాల్లో అరవై సంవత్సరాల వయస్సులో ఉన్న కేవీ రెడ్డిగారి పాత్రను పోషించనుండడం విశేషం.

కాగా ఈ చిత్రంలో క్రిష్ నటించబోయే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట. ఎందుకంటే కేవీ రెడ్డిగారి చివరి రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ చిత్రంలో చూపించనున్నారు. ముఖ్యంగా కేవీ రెడ్డిగారు, ఎన్టీఆర్ గారు మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :