ఇటీవల బాలీవుడ్ లో ప్రవేశించిన దర్శకుడు జాగర్లమూడి క్రిష్ తాను నిర్మిస్తున్న ‘గబ్బర్’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేశారు. తెలుగులో చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ ను రీమేక్ చేస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, శృతి హసన్ లు ప్రధాన పాత్ర పోషించారు. దాదాపు ముంబై, పూణే, లావాస నగరాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంది.
నాలుగు నెలల కంటే తక్కువ సమయంలోనే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ చిత్ర బృందం సంతోషంగా ఉంది.అక్షయ్ కుమార్, శృతి హసన్ లు వేగంగా షూటింగ్ లో పాల్గొని, చిత్ర షూటింగ్ ను త్వరగా ముగించడంతో క్రిష్ వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘గబ్బర్ సినిమా షూటింగ్ ఈ రోజు ముగించారు, ఈ చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చిత్ర బృందానికి కృతఙ్ఞతలు. అయితే ఇది ఇంకా పూర్తికాలేదు’ అని శృతి హసన్ తన ట్విట్టర్ లో పేర్కొంది.
వయాకాం 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ లీలా భన్సల్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాజిద్- వాజిద్ లు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉంది.


