‘కృష్ణార్జున యుద్ధం’ ప్రీమియర్ వసూళ్ల వివరాలు !

నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం మంచి అంచనాల నడుమ ఈరోజే విడుదలైంది. ఓవర్సీస్లో కూడ నానికి మంచి క్రేజ్ ఉండటంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడ సినిమాను మంచి స్థాయిలోనే విడుదల చేశారు. సుమారు 200 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమాకు దగ్గర దగ్గర 600 ల ప్రీమియర్ షోలు
పడ్డాయి.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 157 లొకేషన్లలో వేసిన ఈ ప్రీమియర్ల ద్వారా సినిమాకు 1.64 లక్షల డాలర్లు వసూలయ్యాయి. ఇంకా కొన్ని స్క్రీన్స్ యొక్క కలెక్షన్స్ వివరాలు అందాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయడం జరిగింది.