కొత్త వాళ్ళతో, కొత్త ప్రేమ కథ చేయనున్న కృష్ణ వంశీ !
Published on Jun 9, 2018 9:13 am IST

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందడంతో ఆయన అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఒకప్పుడు కుటుంబ, ప్రేమ కథా చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఆయన్నుండి ఈసారి అలాంటి సినిమా వస్తే బాగుంటుందని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణ వంశీ కూడ ఇలాంటి ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందే తెలిపినట్టు ప్రస్తుతం ఆయన కొత్త సినిమా పనుల్లో ఉన్నారు. సినీ వర్గాల సమాచారాన్ని బట్టి ఆయన డీల్ చేయబోయేది ప్రేమ కథని తెలుస్తోంది. అది కూడ కొత్తవాళ్ళతోనే ఉంటుందట. మరి ఈ సినిమాతో అయిన కృష్ణ వంశీ తన పాత మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook