విలక్షణ దర్శకుడు కృష్ణ వంశీ గత కొంత కాలంగా సక్సెస్ లేక బాగా వెనుకబడిపోయారు. ఇక తాజాగా మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఈ సారి ఆయన మరాఠీ రీమేక్ ను నమ్ముకున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ అనే చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేసే పనిలో వున్నాడు ఈ దర్శకుడు. ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ చేయనున్నాడట.
ఇక కృషవంశీ ఆల్ టైం ఫేవరేట్ హిట్ ‘అంతఃపురం’ లో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలో నానా పటేకర్ నటించారు. ఈచిత్రాన్ని హిందీలో శక్తి పేరుతో కృష్ణ వంశీ నే రీమేక్ చేశాడు. మరి ఇప్పుడు ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి నటసామ్రాట్ కృష్ణ వంశీ కి మరో అంతఃపురంఅవుతుందో లేదో చూడాలి.


