‘రుద్రాక్ష’తో భయపెట్టనున్న క్రియేటివ్ డైరెక్టర్

‘రుద్రాక్ష’తో భయపెట్టనున్న క్రియేటివ్ డైరెక్టర్

Published on Oct 1, 2015 6:01 PM IST

nani-krishna-vamsi
కెరీర్ ప్రారంభం నుంచి గులాబి, సింధూరం, అంతఃపురం, ఖడ్గం, మురారి లాంటి రియలిస్టిక్ అండ్ డిఫరెంట్ సినిమాలను చేసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాలోనూ కుటుంబ విలువలకు పెద్ద పీట వేస్తూ సినిమాలు చేసిన కృష్ణవంశీ మొదటిసారి తన ఫేవరైట్ ఫ్లేవర్ నుంచి బయటకి వచ్చి ఓ హర్రర్ కథాంశంతో తన తదుపరి సినిమా చేయనున్నాడు.

ఈ హర్రర్ సినిమాని నటుడు ప్రకాష్ రాజ్ – దిల్ రాజు కలిసి నిర్మించడానికి సిద్దమయ్యారు. ఇటీవలే పూర్తి కథని సిద్దం చేసిన కృష్ణవంశీ కథని దిల్ రాజుకి వినిపించాడు, దిల్ రాజు కుడా కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నటీనటుల్ని సెలక్ట్ చేసే పనిలో ఉన్న ఈ సినిమాకి ‘రుద్రాక్ష’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు