పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన కృష్ణ లంక

పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన కృష్ణ లంక

Published on Dec 26, 2020 8:00 AM IST

krishna lanka

రంగు సినిమా దర్శకుడైన కార్తికేయ దర్శకత్వంలో పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, రఘు, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటీనటులుగా యారో ఫిక్స్ ఎంటర్టైన్మెంట్ , సొహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న కృష్ణలంక చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ నివ్వగా ,సిటీ డి.యస్.పి. రాంబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా,నగరం దర్శకుడు ప్రేమ్ రాజ్ గౌరవ దర్శకత్వం వహించాడు.

పరుచూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ… మామూలుగా పరుచూరి బ్రదర్స్ కు వయసు వచ్చేసింది అంటే గౌరవంగా ఉంటుంది. ముసలోడు అయ్యాడు అంటే తక్కువగా ఉంటుంది. కానీ కర్ర పట్టుకున్న గాంధీ గారే కదా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా దేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. వారందరూ వయసువారే ప్రతి మనిషి 50 నుండి 60 సంవత్సరాల వరకు డబ్బుకు డబ్బు కోసం తపనపడి, డబ్బు సంపాదిస్తాడు. 60 సంవత్సరాల తర్వాత కీర్తి కోసం తపిస్తాడు.. అలాగే నాకు కార్తికేయ లాంటి వాడు దొరికితే సినిమా తీయడానికి ముందుకు వస్తాను. చిరంజీవి గారు కూడా ఎంతో మందికి అవకాశం కల్పించాడు చిరంజీవి గారి ఖైదీ కు రాసినప్పుడు ఆ రోజుల్లో కష్టమనిపించలేదు ఇప్పుడు కూడా నాపై నమ్మకంతో చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి చేయించారు. అలాగే కార్తికేయ చూస్తుంటే అతను ఐదు అడుగులు హైట్ ఉన్నా ఆలోచనలు మాత్రం పది అడుగుల ఉంటాయి. ఆ లెవెల్ లో ఆలోచిస్తాడు రంగు సినిమా ద్వారా మనిషిలో ఎన్ని రంగులు ఉంటాయో , చెప్పడానికి సినిమా అద్భుతంగా తీశాడు.రంగు సినిమా ఎంత ఆదరాభిమానాలు పొందిందో ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఆదరణ పొంది, దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు..

నిర్మాతలు మాట్లాడుతూ ..కార్తికేయ మాకు రంగు సినిమా నుంచి తెలుసు మేము తీస్తున్న ఈ కృష్ణలంక సినిమా మంచి విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామని అన్నారు

దర్శకుడు కార్తికేయ. వి. మాట్లాడుతూ.. రంగు సినిమా నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. దాని లాగే ఈ కృష్ణలంక సినిమా కూడా కొత్త రకమైన విజువల్స్ తో, కొత్త రకమైన షాట్స్ తో ,కొత్త రకమైన ఎడిటింగ్ ట్రాన్సక్షన్ తో ,రియలిస్టిక్ అప్రోచ్ ఉంటూనే కరెంట్ అఫైర్స్ ను డీల్ చేస్తూ చాలా ఇంపాక్ట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా చేస్తున్నాము .కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త కొత్తగా చూపించగలమని అని నమ్ముతున్నాను.నాపై నమ్మకం తో ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సూర్య మాట్లాడుతూ ..ఈ కృష్ణ లంక చిత్రాన్ని కార్తికేయ పై నమ్మకంతో బడ్జెట్ లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాము. జనవరి 22 న షూటింగ్ స్టార్ట్ చేసి 3 షెడ్యూల్స్ లలో సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు