ప్రభాస్ పెళ్లి వార్తలపై కృష్ణంరాజు కామెంట్స్

ప్రభాస్ పెళ్లి వార్తలపై కృష్ణంరాజు కామెంట్స్

Published on Nov 13, 2015 8:35 AM IST

Prabhas-krishnamaraju
ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ విజువల్ వండర్ ‘బాహుబలి’తో ఇండియా మొత్తాన్ని ఒక్కసారిగా ఆకర్షించిన టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే మొదటగా చెప్పే పేరు ప్రభాస్. గతంలో ప్రభాస్ బాహుబలి తర్వాతనే పెళ్లి అని చెప్పాడు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి కొడుకు కానున్నాడని. అలాగే భీమవరంకి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలతో పాటు ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనే అని ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది.

కానీ ఇవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని, అసలు ఎవరు ఇలాంటివి స్ప్రెడ్ చేస్తున్నారో అని వారిపై మంది పడ్డారు కృష్ణంరాజు. ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు స్పందిస్తూ ‘ప్రభాస్ పెళ్లి వార్తల్లో అసలు నిజం లేదు. అసలు ఇలా ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియడం లేదు. ఇది మొదటిసారి కూడా కాదు. ఒకవేళ ప్రభాస్ పెళ్లి గురించి మేము ఫిక్స్ అయితే మేమే మొదటగా మీడియా ద్వారా అనౌన్స్ చేస్తాం. అప్పటివరకూ ఏ వారలను నమ్మద్దని’ తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 కోసం మళ్ళీ కండలు పెంచుతూ సిద్దమవుతున్నాడు. డిసెంబర్ 14 నుంచి ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి 2 సినిమా షూట్ ని మొదలు పెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు